నేడు మనకు అత్యాధునిక సాంకేతిక విఙ్ఞానం అందుబాటులో ఉండి, ఎన్నో సౌకర్యాలను అందిస్తూ మనల్ని ప్రభావితం చేస్తోంది. సాంకేతిక విఙ్ఞానంతో పరుగులు తీస్తున్న మన చిన్నారులు సరియైన దిశలో ప్రయాణించలేకపోతే మానవతా విలువలు, సంబంధాలు పూర్తిగా మరుగున పడిపోయే అవకాశం ఉంది.
నేటి పోటీ ప్రపంచంలో మంచి మార్కులు, గ్రేడులు, ర్యాంకులకోసం ఒత్తిడికి గురై ఎంతో శ్రమిస్తు ఫలితాలను అందుకుంటున్న మన విద్యార్ధులు మానవతా విలువలు, సంబంధాలు, దేశభక్తి, సంస్కృతి పరిరక్షణలో వెనుకంజ వేస్తున్నారు.
విద్యార్ధి ప్రాధమికస్థాయి నుండి ఉన్నతస్థాయి వరకు గురువులందరు ఈ విషయాలపట్ల శ్రద్ధ తీసుకోవలసిన అవసరం ఎంతైనా వుంది. ముఖ్యంగా భాషోపాధ్యాయులకు ఇటువంటి అంశాలను తమ బోధనలో అమలుజేయుటకు అవకాశం ఎక్కువ.
అందుకే మాతృభాషాబోధకుడిగా నాచేతనైన ప్రయత్నం చేసి, తోటి పండితులకు, చిన్నారులకు, తల్లిదండ్రులకు, పూర్తిస్థాయి సహకారం అందించాలని, తెలుగు బోధనోపకరణలకు ఎవ్వరు ఇబ్బంది పడకూడదని "అక్షరార్చన" చేస్తున్నాను. మనప్రాచీన సాహితీ సంపదను, సంస్కృతీ సంప్రదాయాలను మీ అందరిద్వారా మరెందరికో అందించే ప్రయత్నం చేస్తున్నాను.
తెలుగువాడిగా జన్మించినందుకు గర్విస్తూ, మన భాష, సంస్కృతీ పరిరక్షణలో భావి తరాలకు వరంగా "అక్షరార్చన" కాగలదని విశ్వసిస్తు, నిరంతరం మీ సహకారం కోరుతు, మీకు తెలిసిన విలువైన అంశాలను ఈ వెబ్ సైట్ ద్వారా తెలియజేస్తారని ప్రార్ధిస్తూ........
మీ జోస్యుల.
A teacher’s duty is not only to teach the lessons of the prescribed syllabus in the class room, but also to make the students responsive to the quick happenings around the globe that curb the growth of nations and act accordingly to minimize the loss, with their humbleness and smart work. No doubt the present technological advancement has made our lives more comfortable and convenient, but the long cherished human values and relations are at crossroads. Good tradition and culture followed in our ancient times has almost been vanished. What we have to do is by using this new technology we can make the students to know and appreciate the beauty of our culture for; we know students are the building blocks of our nation. As a Telugu Pandit, I am trying to rejuvenate the importance of our mother tongue and also to reestablish our ancient tradition. All my writings are presented by JOSYULA MELODIES. I am also presenting all the songs and videos of my own lyrics. I hope you will support me in my endeavor to nurture our mother tongue and our tradition.
YOURS JOSYULA
1 Comments
అక్షరార్చన అద్భుతంగా ఉంది మాష్టారు.
ReplyDelete